లబ్ధిదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ
WGL: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇవాళ నెక్కొండ గ్రామపంచాయతీ పరిధిలోని ఈదునూరి రవి డీలర్ షాప్‌లో లబ్ధిదారులకు బియ్యం సంచులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ హరీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.