రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

SDPT: పట్టణంలోని కోటిలింగాల 11kv ఫీడర్ పరిధిలో మెయింటెనెన్స్ పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ కోత విధించనున్నట్లు ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మారుతి నగర్, శ్రీ సాయి నగర్, బాలాగౌడ్ నగర్ ఏరియాల్లో కరెంట్ ఉండదని పేర్కొన్నారు. మరమ్మతు పనుల దృష్ట్యా వినియోగదారులు ఆ నాలుగు గంటల పాటు సహకరించాలని ఆయన కోరారు.