నీటి విడుదలకు నో చెప్పిన అధికారులు

నీటి విడుదలకు నో చెప్పిన అధికారులు

పల్నాడు జిల్లా లంకెల కూరపాడులోని మంచినీటి చెరువును అధికారుల బృందం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీలో చెరువు నీటిని బయటకు విడుదల చేయరాదని ఎంపీడీవో పీ. రత్నం సూచించారు. ముఖ్యంగా చేపల కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. చెరువుల పరిరక్షణపై అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.