LPG బుకింగ్ విషయంలో జాగ్రత్త: సజ్జనార్

LPG బుకింగ్ విషయంలో జాగ్రత్త: సజ్జనార్

HYD: గ్యాస్ సిలిండర్ బుకింగ్, KYC అప్‌డేట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై సీపీ వీసీ.సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులకు OTP లేదా బ్యాంక్ వివరాలు వెల్లడించవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని ఆయన సూచించారు. గ్యాస్ బుకింగ్ కోసం కేవలం అధికారిక యాప్స్ లేదా వెబ్‌సైట్లను మాత్రమే వాడాలని ట్వీట్ చేశారు.