పొదలకూరు పీఏసీఎస్ ఛైర్మన్ ఎంపిక

NLR: పొదలకూరు పీఏసీఎస్ ఛైర్మన్‌గా తలచీరు మస్తాన్ బాబు ఇటీవల నియామకమయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు రుణాలు అందించే విషయంలో మెరుగైన సేవలు అందించాలని సూచించారు.