గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

హనుమకొండ జిల్లా కేంద్రంలోని అర్బన్ గురుకుల పాఠశాలను కలెక్టర్ స్నేహ శబరిష్ ఇవాళ సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు పాఠ్యాంశాలపై విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు అందుతున్న ఆహార పదార్థాలు మెనూ ప్రకారం ఉన్నాయా లేదా అని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.