VIDEO: ప్రభుత్వ హైస్కూల్లో బాలల దినోత్సవం
ELR: చింతలపూడి ప్రభుత్వ హైస్కూల్లో శుక్రవారం బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ మధుబాబు మాట్లాడుతూ.. చిన్నారి విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. భావి భారత పౌరులుగా అన్ని రంగాలలో ముందుండాలని ఆకాంక్షించారు. ఇందులో సీఐ క్రాంతికుమార్, హెచ్ఎం సుధాకర్, న్యాయవాదులు ఉమర్ షారుక్, దుర్గ భవాని పాల్గొన్నారు.