రేపు మంత్రి దామోదర్ పర్యటన

రేపు మంత్రి దామోదర్ పర్యటన

SRD: మునిపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు గురువారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించనున్నారని ఏఎంసీ ఛైర్మెన్ సుధాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీశ్ కుమార్ తెలిపారు. మండలంలో భూదేర మహిళా డిగ్రీ కళాశాల, మోడల్ స్కూల్‌లను సందర్శించనున్నట్లు చెప్పారు. ఖమ్మంపల్లి బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు.