బాబు షూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమం

బాబు షూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమం

ప్రకాశం: మద్దిపాడు మండలం ఇనామనమేల్లూరులో బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి మెరుగ నాగర్జున గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల తెలియపరిచే క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.