సీఎం నివాసం వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

సీఎం నివాసం వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

GNTR: ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఆదివారం మంగళగిరికి చెందిన అడిగోపుల క్రాంతి కిరణ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన ఇల్లు కబ్జాకు గురైందని, లోకేశ్ 'ప్రజా దర్బార్'లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.