VIDEO: విశాఖ ఏయూలో అలజడి
VSP: విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహణపై తలెత్తిన వివాదం బుధవారం ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుతంగా శాఖ నిర్వహిస్తున్న వారిపై కమ్యూనిస్టు భావజాలం ఉన్నవారు దాడి చేశారని బీజేపీ నేత పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. వర్సిటీలో రాజకీయ పరిణామాలను అడ్డుకోవాలని విద్యార్థులు రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు భారీగా మొహరించారు.