సిబ్బందికి దిశా నిర్దేశం చేసిన సీఐ

సిబ్బందికి దిశా నిర్దేశం చేసిన సీఐ

VZM: రేపు కొండడాబాలులో జరిగే వ్యాకులమాత పండగకు బందోబస్తు నిమిత్తం ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, 300 మంది కానిస్టేబుళ్లు కేటాయించారు. ఈ మేరకు స్థానిక సీఐ షణ్ముఖరావు శనివారం సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. భక్తులు అధికంగా రావడంతో వీధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పండగలో తోపులాటలు, అల్లర్లు జరగకుండా చూడాలని కోరారు.