పారా బాడ్మింటన్ విజేతలను అభినందించిన కలెక్టర్
PPM: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని SAAP ఆధ్వర్యంలో గుంటూరులో పారా రాష్ట్ర స్థాయి బాడ్మింటన్ పోటీలు నిర్వహించారు.వీటిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి మెడల్స్ సాధించిన జిల్లాకు చెందిన పారా క్రీడాకారులను కలెక్టర్ రామసుందర రెడ్డి గురువారం తన కార్యాలయంలో అభినందించారు.కార్యక్రమంలో ఎస్. వెంకటేశ్వర రావు, దయానంద్ పాల్గొన్నారు.