కాల్వలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

SRPT: చిలుకూరు మండలం రామచంద్రా నగర్ వద్ద ఉన్న ఆర్ కె మేజర్ కాల్వలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఎస్సై సురేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి 50 సంవత్సరాలు ఉండవచ్చని, రెండు చేతులకు పచ్చబొట్లు ఉన్నట్లు తెలిపారు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.