పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
JN: స్టేషన్ ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న పాఠశాల అభివృద్ధి పనులను పరిశీలించారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు.