MNJ క్యాన్సర్ ఆస్పత్రి బయట ఇదీ పరిస్థితి..!
HYD: సిటీలోని MNJ క్యాన్సర్ ఆస్పత్రి బయట రోడ్డు మరీ అధ్వానంగా తయారైంది. గుంతల రోడ్డుతో దర్శనమిస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కాగా, నిత్యం వివిధ జిల్లాల నుంచి అనేకమంది చికిత్స కోసం ఇక్కడకు వస్తుంటారు. అటు నాంపల్లి, ఇటు లక్డీకాపూల్ నుంచి ఆస్పత్రికి వచ్చే రోగులు ఈ గుంతల రోడ్డుతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.