ఈ రోజు ఉచిత వైద్య శిబిరం

Vsp: ఈనెల 26వ తేదీన అగనంపూడి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. విశాఖకు చెందిన వీ హెల్త్ కేర్ సౌజన్యంతో ఉచిత రక్త పరీక్షలు, ఈసీజీ, షుగర్ పరీక్షలతో పాటు దంత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శిబిరాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.