రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు.. స్పందించిన సీఈసీ
TG: సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. ఆయనపై వచ్చిన ఫిర్యాదుపై సీఈసీ రాణి కుముదిని స్పందించారు. ఆ ఫిర్యాదును ఎంసీసీ కమిటీకి పంపించామన్నారు. ఆ కమిటీ నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. రెండు సంవత్సరాల ప్రజా పాలన ఉత్సవాల కోసం అనుమతి అడిగారని.. అందుకు తాము అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.