రోడ్డు ప్రమాదం.. మహారాష్ట్ర యువకుడు మృతి

రోడ్డు ప్రమాదం.. మహారాష్ట్ర యువకుడు మృతి

NZB: నవీపేట మండలం జగ్గయ్య రావు ఫారం వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన సురేష్ (19) మృతి చెందాడు. బైక్‌పై నిజామాబాద్ వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. బావను కలిసేందుకు కళ్యాపూర్ వచ్చిన సురేష్, మార్గమధ్యలో మరణించాడని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. దీంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది.