'ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయాలి'

'ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయాలి'

KMR: రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ చేయాలని సహకార శాఖ క్లస్టర్ అధికారి శ్రీనివాస్ సూచించారు. గురువారం ఎల్లారెడ్డి మండలం గండి మాసానిపేటలోని సొసైటీని ఆయన సందర్శించారు. యూరియా నిల్వలను పరిశీలించారు. యూరియా కావాల్సిన రైతులు ఆధార్ కార్డు లేదా పట్టా పాస్‌బుక్ జిరాక్స్ తీసుకొచ్చి సకాలంలో పొందాలని ఆయన సూచించారు.