ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి: డీఈవో
కోనసీమ: సఖినేటిపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం ఎంఈవోలతో డీఈవో షేక్ సలీం భాషా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తోందని చెప్పారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల సంఖ్య పెంచాలని తెలిపారు.