బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలి: మాజీ సీఎం
ఒడిశా నువాపడ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో మాజీ సీఎం నవీన్ పట్నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పాలకులు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అలాంటి నాయకులు మరోసారి ఓట్ల కోసం అడుగుతున్నారని.. వారికి సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గతంలో బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.