అంధత్వాన్ని నివారించడం అందరి బాధ్యత

అంధత్వాన్ని నివారించడం అందరి బాధ్యత

నెల్లూరు: పాఠశాల పిల్లల్లో అంధత్వాన్ని నివారించడం అందరి బాధ్యతని కంటి వైద్యనిపుణులు ఎం. శ్రీలేఖ అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండల విద్యాశాఖ కార్యాలయంలో గురువారం పాఠశాల పిల్లల్లో ఏర్పడే కంటి సమస్యలపై జిల్లా అంధత్వ నివారణా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. హస్వదృష్టి, దీర్ఘదృష్టి, గ్లకోమా, కండ్ల కలక వంటి వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.