కల్తీ నెయ్యి కలకలం.. అడ్డుకున్న పోలీసులు

కల్తీ నెయ్యి కలకలం.. అడ్డుకున్న పోలీసులు

E.G: జిల్లాలో కల్తీ నెయ్యి పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. చెందుర్తి నుంచి రౌతులపూడికి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న కల్తీ నెయ్యి డబ్బాలను శుక్రవారం మీడియా ప్రతినిధులు అడ్డగించారు. జంతువుల వ్యర్థాల కొవ్వుతో తయారు చేసిన నూనె డబ్బాలను తరలిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే పోలీసులు అడ్డగించి ఆటోను రౌతులపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.