గండికోట జలాశయం తాజా సమాచారం

KDP: గండికోట జలాశయంలో గురువారం ఉదయం 14.73 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. జలాశయం నీటిమట్టం 684.31 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో లేదని, జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ ద్వారా సర్వరాయసాగర్ రిజర్వాయర్‌కు 350 క్యూసెక్కులు, తాగునీటి స్కీమ్ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నట్లు ఈఈ ఉమామహేశ్వర్లు వెల్లడించారు.