VIDEO: మేడారం జాతర సురక్షిత నిర్వహణ కోసం ఐజీ సమీక్ష

VIDEO: మేడారం జాతర సురక్షిత నిర్వహణ కోసం ఐజీ సమీక్ష

ములుగు: జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతలను మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ దర్శించుకున్నారు. జాతర సందర్భంగా పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. భక్తుల సౌకర్యం కోసం వాహన పార్కింగ్ ప్రాంతాల ఏర్పాట్లు, పోలీసులు, సిబ్బంది కేటాయింపు, అత్యవసర సేవల కోసం ప్రణాళికలు పరిశీలించి అవసరమైన మార్పులను సూచించారు.