క్రీడా ప్రాంగణ పనులను పరిశీలించిన MLA చదలవాడ
PLD: నరసరావుపేట డా. కోడెల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులను ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా స్థానికులు, కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. యువతకు క్రీడలు ముఖ్యం కాబట్టి, అధికారులు క్రీడా ప్రాంగణం పనులను వేగవంతం చేసి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని ఎంపీడీవో, మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు.