తొలి భారత బౌలర్‌గా బుమ్రా

తొలి భారత బౌలర్‌గా బుమ్రా

టీమిండియా పేసర్ బుమ్రా అరుదైన రికార్డు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెవిస్‌ (22) వికెట్‌ తీసి.. టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో అన్ని ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఓవరాల్‌గా లసిత్ మలింగ, షకిబ్ అల్ హసన్, టిమ్ సౌథీ, షహీన్ అఫ్రిది మాత్రమే ఈ ఘనత సాధించారు.