ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ సత్య శారద పరిశీలించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, అధికారులు, రైతులు తీసుకుంటున్న జాగ్రత్తలను ఆమె గమనించారు. రైతులు టార్పాలిన్ కప్పి ధాన్యాన్ని రక్షించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.