నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: భీమిలి మండలం చిట్టివలస సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ బి.సింహాచలం నాయుడు తెలిపారు. ఈ మేరకు టి.నగరపాలెం, సింగనబంద, లక్ష్మిపురం, మజ్జివలస, కృష్ణంరాజు పేట, నారాయణ రాజు పేట, కనకాల పేట, తాటితూరు, గొల్లలపాలెం గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆమన పేర్కొన్నారు.