'యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

'యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

అనకాపల్లి డైట్ కళాశాలలో దండి మార్చ్ 2.0 పేరిట డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈగల్ అదనపు ఎస్పీ టీ.ప్రభాకర్ బాబు విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై వివరించారు. విశాఖ ఈగల్ ఇన్‌స్పెక్టర్ కళ్యాణి, డీఎస్పీ శ్రావణి NDPS చట్టం, శిక్షలు, డీ-అడిక్షన్ కేంద్రాలపై అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.