అమరావతి రాజధానిసాధనకు కొండపి నాయకులు కృషి
ప్రకాశం: కొండపి మండలంలో ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత YCP హయాంలో రాజధాని రైతుల పాదయాత్ర కొండపికి చేరింది. అప్పుడు ప్రస్తుత MLA కొలకపూడి శ్రీనివాసరావుతో కలిసి కొండపి టీడీపీ నాయకులు కదంతొక్కారు. అమరావతికి చట్టబద్ధత రావడంతో ప్రస్తుతం మండలంలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. TDP మండల నాయకుడు మోహన్ అప్పుడు ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.