'ఆధార్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి'
AKP: నాతవరం మండలం వైడీ పేట సచివాలయంలో శుక్రవారం ప్రత్యేక ఆధార్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో ఆధార్ అప్డేట్, బయోమెట్రిక్, పేర్లు, చిరునామా, ఫోన్ నెంబర్లు మార్పులు, చేర్పులు వంటి సేవలను అందించారు. ఈ మేరకు డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు ఈ ఆధార్ క్యాంపును సందర్శించారు. ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.