కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా పొంగులేటి ప్రచారం
TG: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రహమత్ నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరుపున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం నవీన్‌ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పాలన మొదలైన తర్వాత రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందన్నారు.