త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం: ఎంపీ
WGL: వరంగల్‌ను రెండో రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను అమలు చేస్తున్నదని ఎంపీ కడియం కావ్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. త్వరలోనే మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని, ఓరుగల్లు సమగ్ర అభివృద్ధిపై ప్రజాప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు.