VIDEO: ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు ఢీ
MDK: తూప్రాన్ వద్ద ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. తూప్రాన్ నుంచి పోతరాజుపల్లి వైపు వెళ్తున్న బస్సు, ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. రెండు వాహనాలు బలంగా ఢీకొన్నప్పటికీ ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ, ఎవరికీ గాయాలు కాలేదు.