నేను ఈ సినిమాలో ఉన్నానా?: లయా
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న 'తమ్ముడు' సినిమా జూలై 4న విడుదల కానుంది. దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం వీడియో విడుదల చేసింది. ఈ మూవీలో లయ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఒక్క ప్రకటనా లేదు.. పోస్టర్ విడుదల చేయలేదు.. అసలు నేను ఈ సినిమాలో ఉన్నానా సర్?' అని డైరెక్టర్‌ను లయ ప్రశ్నిస్తున్న వీడియో ఆకట్టుకుంది.