'శ్రీకాళహస్తి ఆలయంలో అడుగడుగునా అవినీతి'
AP: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో అడుగడుగునా ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఓ భక్తురాలు ఆరోపించింది. ఈ మేరకు వీడియో ద్వారా తన అనుభవాన్ని పంచుకున్న ఆమె.. ఆలయంలోని పోలీసులు, అర్చకులు మొదలు మంగళవాద్యాలు వాయించేవారు వరకు అంతా డబ్బులు అడుగుతున్నారని పేర్కొంది. ఐ కాంటాక్ట్ అయితేనే డబ్బులు అడిగేస్తున్నారని.. అత్యంత బాధాకర పరిస్థితి ఉందని చెప్పుకొచ్చింది.