కోడలిపై అత్యాచారయత్నం.. మామకు జైలు శిక్ష
PDPL: గోదావరిఖని రమేష్ నగర్‌లో గతేడాది నవంబర్‌లో కోడలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన మామ ఐత చంద్రయ్యకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు జడ్జి శ్రీనివాస రావు తీర్పునిచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వన్ టౌన్‌లో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన అనంతరం తీర్పు వెలువడినట్లు SI భూమేష్ పేర్కొన్నారు.