VIDEO: మలేరియా పై అవగాహన ర్యాలీ

WGL: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేటలో శుక్రవారం వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీసిహెచ్‌వో డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి వారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మలేరియాను అరికట్టేందుకు దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.