అంజమ్మ మృతదేహాన్ని మరోచోటికి తరలించిన పోలీసులు
ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 554 భూమిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోయపాలెంకు చెందిన చొప్పరపు అంజమ్మ మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకెళ్తుంటే పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు మున్సిపాలిటీ వాహనం ద్వారా అంజమ్మ మృతదేహాన్ని పట్టణంలోని గార్లపేట రోడ్‌లో ఉన్న స్మశాన వాటికకు తరలించారు.