రేపు కామారెడ్డిలో రక్తదాన శిబిరం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం కేబీసీ బ్లడ్ బ్యాంక్‌లో ఏర్పాటు చేసినట్లు జిల్లా రక్తదాతల సమూహం అధ్యక్షుడు జమీల్ హైమద్ తెలిపారు. రక్తదానం చేసే ప్రతి రక్తదాతకు హెల్మెట్, ప్రశంస పత్రం అందజేస్తామని చెప్పారు. యువకులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు.