ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

NLG: శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో గల ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నేటి నుంచి ఈనెల 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ కృష్ణ మోహన్ సోమవారం తెలిపారు. దరఖాస్తులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదని, ప్రభుత్వం ఉచితంగా దరఖాస్తులు స్వీకరిస్తుందని తెలిపారు. ఈనెల 27- 31 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందన్నారు.