కార్యకర్తల ఆర్థిక బలోపేతమే టీడీపీ లక్ష్యం: మంత్రి
W.G: టీడీపీ లక్షల మంది క్రమశిక్షణ గల కార్యకర్తలతో నడుస్తున్న పార్టీ అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లు లైన్స్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యకర్తల ఎంపవర్మెంట్ సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రతి కార్యకర్త ఆర్థికంగా బలోపేతం కావాలని, రాష్ట్రంలో ప్రతిఇంటి నుంచి పారిశ్రామికవేత్త తయారవ్వాలనే చంద్రబాబు ఆశయమన్నారు.