VIDEO: జనగామలో పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం
JN: జిల్లా కేంద్రంలోని కోర్ట్ ఏరియా, సిద్దిపేట రోడ్డు సమీపంలోని శ్రీనివాస కాలనీలో సోమవారం రాత్రి వర్షంతో పాటు పిడుగు పడటంతో ఒక కొబ్బరి చెట్టు పూర్తిగా కాలిపోయింది. పిడుగు చెట్టుపై పడటంతో మంటలు చెలరేగి చెట్టు దగ్ధమైంది. భారీ శబ్దంతో కాలనీ నివాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.