VIDEO: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలు
కోనసీమ: కొత్తపేటలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపేట నుంచి పలివెల వైపు బైక్ పై వెళ్తున్న దంపతులను రావులపాలెం వైపు వస్తున్న బుల్లెట్ బైక్ ఢీకొట్టడంతో భార్యాభర్తలు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి దగ్గరలో ఉన్న షాపులో ఉన్న సీసీటీవీలో దృశ్యాలు నమోదు అయ్యాయి.