జిల్లాలో ఉచిత కంటి పొర శస్త్ర చికిత్స శిబిరం
MLG: ఈ నెల 22 నుంచి 30వరకు జిల్లాలోని గిరిజన భవన్‌లో ఉచిత కంటి పొర శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించనున్నారు. ఈ ఉచిత శిబిరాన్ని ఉపేంద్ర రాచుపల్లి, శిల్ప, సంజోష్ ఫౌండేషన్ సహకారంతో అలాగే స్థానిక యాక్టర్ సంజోష్, శంకర నేత్రాలయ మెసు (MESU) చెన్నై వారు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని గిరిజన ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పీ శబరీస్ ఒక ప్రకటనలో తెలిపారు.