VIDEO: శివభక్తిని చాటుకున్న ఎలుగుబంటి

మనుషులే కాదు, మూగజీవాలు కూడా దైవభక్తిని ప్రదర్శిస్తాయని నిరూపించే ఓ అరుదైన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. కాంకేర్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న శివాలయానికి ఎలుగుబంటి వచ్చి, గర్భగుడి ముందున్న గంటను మోగించి తన భక్తిని చాటుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివుడిపై భక్తితోనే ఎలుగుబంటి గంట మోగించిందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.