మద్యం పోయలేదని వధువు, వరుడిపై దాడి

మద్యం పోయలేదని వధువు, వరుడిపై దాడి

మధ్యప్రదేశ్‌లో మద్యం కోసం జరిగిన గొడవ పెళ్లి ఇంట్లో విషాదం నింపింది. గ్వాలియర్‌లో మహేష్ జాతవ్ పెళ్లి జరుగుతుండగా, మద్యం కోసం డబ్బులివ్వాలని పొరుగువారు గొడవకు దిగారు. వరుడు నిరాకరించడంతో ఆగ్రహించిన వారంతా పెళ్లి కూతురు, వరుడు, వారి తల్లిదండ్రులపై దాడి చేశారు. ఇంట్లోని సామాన్లు, నగదును దోచుకెళ్లారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.