అక్రమంగా దేశీ దారు అమ్ముతున్న వ్యక్తి పై కేసు

ADB: తలమడుగు మండలంలో దేశిదారు అమ్ముతున్న ప్రదేశంలో దాడులు నిర్వహించినట్లు ఎస్సై రాధిక తెలిపారు. ఎస్సై వివరాలు ప్రకారం.. మండలంలోని సోనాపూర్ గ్రామంలో శివారులో ఆత్రం సోనే రావు అనే వ్యక్తి నిషేధిత MH అక్రమ దేశిదారు అమ్ముతుండగా 31 దేశిదారు బాటిల్ పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సోనే రావు పోలీసులను చూసి పారిపోగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.